MDK: రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రేపు ఉదయం 10 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సభ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో షాజలోద్దీన్ తెలిపారు. ఈ సభకు సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు, VOలు, NGOs, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.