MDK: 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ధర్మారంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని స్పెషల్ ఆఫీసర్ రజనీకుమారి తనిఖీ చేశారు. కిచెన్ షెడ్, టాయిలెట్లను పరిశీలించి, హాస్టల్ పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు హాస్టల్ నిర్వహణ ఉండాలని ఆమె స్పష్టం చేశారు.