ASF: కాగజ్ నగర్ మండలంలోని కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో SMAM పథకం కింద 40% సబ్సిడీపై డ్రోన్ స్ప్రే యంత్రాలను శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. MLC దండే విఠల్ ఈ కార్యక్రమంలో పాల్గొని యంత్రాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని PACS లకు ఈ యంత్రాలు లభించాయి. ఆధునిక వ్యవసాయ పరికరాల ద్వారా దిగుబడులు పెంచుకోవాలని MLC రైతులను కోరారు.