HNK: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాకు 3.65 లక్షల పని దినాల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు సుమారు 70 వేల పని దినాలు మాత్రమే పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.