MDCL: అల్వాల్ సఖీ కేంద్రంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వికలాంగుల సహకార సంస్థ, మహిళా శిశు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, మోటార్ వాహనాలు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, MRO, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.