MBNR: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఆచార్య జయశంకర్ ఆశయాలు నెరవేరలేదని ఆచార్య జయశంకర్ సేవాసమితి అధ్యక్షులు కందమూరి బ్రహ్మయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులను ఆయన సంఘ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నారు.