NLG: చండూరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.