KNR: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పట్టణ CI రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపూర్కు చెందిన కిషన్(30) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లెలి వివాహం, తండ్రి అనారోగ్య కారణాలతో ఈ అగాయిత్యం చేసుకున్నట్లు సమాచారం.