RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబ్‌పేట మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ.. ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విన్నపంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.