SRD: కాలుష్యం మాకు.. అభివృద్ధి మీకా? అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక పరిశ్రమల CSR నిధులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని తప్పుబడుతూ, వాటిని స్థానిక అభివృద్ధి పనులకే కేటాయించాలని కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం ఇచ్చారు. నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.