BDK: ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది, శనివారం రంజాన్ సెలవు దినాలు కావడంతో శుక్రవారం ఒక్కరోజు లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ఇక పండుగ రద్దీ దృష్ట్యా 17, 18వ తేదీల్లో TGSRTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.