కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 40 మంది డీలర్లకు 48 వారాలు డీఏఈఎస్ఐ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాల, ఎరువుల కోసం వచ్చే రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆమె అన్నారు. రైతులు డీలర్లను నమ్ముతారని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించాలన్నారు. డీలర్లకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు.