MDK: జూన్ 4,6,8,10 తేదీల్లో జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆమె మాట్లాడారు. సభల్లో ఓటరు జాబితా సవరణ, పంట మార్పిడి, సన్న వరి సాగు, బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.