KMM: చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నుంచి HPV టీకా పంపిణీ ప్రారంభం కానున్నట్లు వైద్యాధికారి ఆల్తాఫ్ తెలిపారు. 14-15 ఏళ్ల బాలికలు ఈ టీకాకు అర్హులని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారు ఆధార్ కార్డు, మొబైల్‌తో తల్లిదండ్రుల సమక్షంలో హాజరుకావాలని సూచించారు.