NGKL: సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాల సమయాన్ని పొడిగించాలని చెంచులోకం రాష్ట్ర అధ్యక్షుడు కాట్రాజు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు వారం రోజుల పాటు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. సుదూర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం నిబంధనలు సడలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.