TG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందన్నారు.