శర్వానంద్ హీరోగా.. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘బైకర్’. APR 3న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా చేయలేదు. తీయలేదు, చూడలేదు. ఈ సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టాను. మరోసారి చెబుతున్నా బైకర్ బంపర్‌హిట్ అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశాడు.