SRPT: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం రేపు ఉదయం 9 గంటలకు, అనంతగిరి మండలం శాంతినగర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి శ్రీనివాసరావు శనివారం రాత్రి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఆధార్ కార్డు, ఆన్లైన్ అప్లికేషన్ కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని ఆయన సూచించారు.