BHNG: భువనగిరి మండల పశువైద్యశాల పరిధిలో గల సబ్ సెంటర్ల డాక్టర్లు గొర్ల మేకల కాపర్లకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని, జీఎంపీఎస్( గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం) జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా కోరారు. సోమవారం భువనగిరి మండలంలోని ముస్త్యాల పెల్లి, చీమల కొండూరు, రాయగిరి గొర్రెల మందల ను సందర్శించి, గొర్ల కాపరులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.