ADB: అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని CI నరేష్ కుమార్ హెచ్చరించారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని పంచాయతీ నిర్వహించి రూ.1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితుడి చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు CI వెల్లడించారు.