NRPT: ఊట్కూరు మండలం అమీన్పూర్ నుంచి నారాయణపేట వెళ్లే ఆర్టీసీ బస్సు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల దృష్ట్యా ఒంటిపూట తరగతులు నిర్వహిస్తుండగా, విద్యార్థులు 9:15 గంటలకు గానీ స్కూళ్లకు చేరుకోలేకపోతున్నారు. స్కూలు గంట 7:45కే మోగుతుంటే, బస్సు 8:15కి వస్తుందన్నారు.