మెదక్ జిల్లా రామాయంపేట సబ్స్టేషన్ వద్ద విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా బచ్చు రాజుపల్లి తండాకు చెందిన బాబూలాల్ అనే ప్రైవేట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్ తరలించగా, తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు సబ్స్టేషన్ వద్ద అధికారులతో వాగ్వాదానికి దిగారు.