SRCL: ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. మంగళవారం బోయినపల్లి మండల కేంద్రలోని పోలీస్ స్టేషన్ ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచు పర్యటించాలన్నారు.