HNK: హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపు వడ్డెర కాలోని గ్రామంలో పల్లెబోయిన కుమారస్వామి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారని సమాచారం మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 66 క్వింటాళ్ల రూ. 2,31,000 విలువగల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.