ADB: జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన ఆకాల వర్షాలకు మార్కెట్ యార్డ్‌లోని ధాన్యము తడిసిపోయిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని MLA అనిల్ జాదవ్ భరోసా కల్పించారు.