VKB: పరిగి మున్సిపల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉదయం అయినప్పటికీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. దీంతో అనవసరంగా విద్యుత్ వినియోగం పెరిగి ప్రజాధనం వృథా అవుతోందని కాలనీలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.