నటుడు రాఘవ లారెన్స్ కుమార్తె రాఘవి మాత్రం మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకుండానే నేరుగా దర్శకురాలిగా మారబోతున్నట్లు టాక్. దీనికోసం అమెరికాలో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన రాఘవి, తన టెక్నాలజీ నాలెడ్జ్‌పై నమ్మకంతో భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె చేయబోయే సినిమాను లారెన్స్ స్వయంగా నిర్మించనున్నాడట.