ADB: పర్యావరణ పరిరక్షణకు సైకిలింగ్ ఎంతో దోహదకరమని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పర్యావరణ వారోత్సవాలల్లో భాగంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, ఇంధన పొదుపునకు సైకిల్ తొక్కడం ఎంతో మేలైన మార్గమని పేర్కొన్నారు.