కృష్ణా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనుమడు యశ్వంత్ అంబేద్కర్ కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి శివారు చిరువోలు గ్రామానికి విచ్చేశారు. గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య నివాళులర్పించారు.