TG: రేపు మహబూబ్నగర్లో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు.. కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే తెలంగాణ వచ్చింది. గత పదేళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ. లక్ష కోట్లు అవసరమవుతాయి’ అని తెలిపారు.