ASF: వాంకిడి మండలానికి చెందిన వేముల చంద్రయ్య జూన్ 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రయ్య కాగజ్నగర్ X రోడ్ వద్ద చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. అదృశ్యమైన సమయంలో తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే వాంకిడి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.