NLG: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి మొత్తం 123 ఫిర్యాదులు వచ్చాయి. అందులో రెవిన్యూ శాఖకు 59, ఇతర శాఖలకు 64 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్డీవోలు పాల్గొన్నారు.