ADB: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద బందోబస్తు ప్రక్రియను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం పరిశీలించారు. ఈద్గా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముస్లింలకు SP రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.