అన్నమయ్య: చిట్వేల్ మండలంలో టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా ఆదివారం నిర్వహించారు. నాగవరం, నేతివారిపల్లి, పెద్దూర్, జెట్టివారిపల్లి, చిట్వేల్ గ్రామాల్లో పార్టీ జెండాలనుకాకర్ల నాగార్జున ఎగురవేశారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. నాయకులు కార్యకర్తలు ఆయన సేవలను కొనియాడారు.