BHPL: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో శనివారం తెల్లవారుజామున 8.4 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాలవారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మల్హర్రావులో 4.6 MM, BHPLలో 2.8 MM, మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదుకాలేదని అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణం శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.