JGL: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.65,07, 540 విలువైన 65 చెక్కులను అందజేశారు. ఈ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన పథకాల ప్రాముఖ్యతను ఎమ్మెల్యే తెలిపారు.