NRPT: ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో DEO గోవిందరాజు, నారాయణపేట MEO బాలాజీలకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫారాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్లో అడ్డగోలు ఫీజులను వెంటనే నియంత్రించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు.