NLG: వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం స్వాగత–వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి గ్రేడ్-2గా పనిచేస్తున్న ఆర్. జానయ్య బదిలీపై చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్లగా, జె. సత్యనారాయణ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.