BHPL: పట్టుదలతో కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని BHPL సింగరేణి ఏరియా GM రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం BHPL జిల్లాలో స్కౌట్స్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ‘పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ క్యాంప్’ను ఆయన పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. దేశంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు మాత్రమే రాష్ట్రపతి అవార్డు పొందే విశిష్ట అవకాశం ఉందన్నారు.