ASF: తెలంగాణ డీజీపీ పర్యటన నేపథ్యంలో ఆసిఫాబాద్లో బాంబ్ స్క్వాడ్ ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జిల్లా అంతటా ముందస్తు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.