NLG: నాగార్జునసాగర్ కొండ ప్రాంతం ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పచ్చని అటవీ ప్రాంతం, కొండల మధ్య విస్తరించిన కృష్ణా నది అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సాగర్ డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి కనిపించే నీటి విస్తీర్ణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొండపై ఉన్న వ్యూ పాయింట్లు, అడవిలోని సహజ దృశ్యాలు ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి.