SDPT: బెజ్జంకిలో జనావాసాల మధ్య పందుల పెంపకం కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సర్పంచ్ బొల్లం శ్రీధర్‌ను కలిసి సమస్యను వివరించారు. పందుల కారణంగా దుర్వాసన వ్యాపించి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుని పందులను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని విజ్ఞప్తి చేశారు. తగు చర్య తీసుకుంటానని సర్పంచ్ హామీ ఇచ్చారు.