SRCL: ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలోని ప్రభుత్వ పాఠశాలకు మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహారెడ్డి తాళం వేశారు. రెండు తరగతి గదులు, డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ. 22 లక్షల బిల్లులు విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల కార్యకలాపాలు నిలిచిపోయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.