NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి రెడ్ కార్పెట్ పరుస్తూ రైతు కూలీలను విస్మరిస్తున్నాయని AIKMS రాష్ట్ర నాయకులు విమర్శించారు. ధర్పల్లిలో నిర్వహించిన ఆర్మూర్ డివిజన్ మహాసభల్లో వారు మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా గతంలో నల్ల చట్టాలు తెచ్చారని మండిపడ్డారు. పాలకుల రైతు వ్యతిరేక విధానాలపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.