MBNR: పాలమూరు యూనివర్సిటీలో మహాత్మా బసవేశ్వరుని జయంతి ఘనంగా జరిగింది. వీసీ ఎన్. శ్రీనివాస్ నివాళులర్పిస్తూ, “కాయకవే కైలాస” అని చాటిన గొప్ప సంస్కర్త బసవన్న అని కొనియాడారు. కులరహిత సమాజం కోసం ఆయన చేసిన కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.