ASF: సిర్పూర్ మండలం కోనేరు కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డోర్ పల్లి గ్రామానికి చెందిన రక్షిత్, రవి గాయపడినట్లు 108 EMT అజయ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సిర్పూర్ PHC కి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించినట్లు వెల్లడించారు.