BDK: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠాను నాయక్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని జేఏసీ ఛైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. కొత్తగూడెం మేయర్ గణేష్‌ను కోరారు. ఈనెల 20న ఠాను నాయక్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.