KNR: జమ్మికుంట పట్టణంలోని మూడు కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 22 మంది, ఓకేషనల్లో 28 మంది.. మొత్తంగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.