MBNR: రాజాపూర్ మండల పరిధిలోని గుండ్ల పొట్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాడమోని మాసయ్య అధ్యక్షతన జరిగి సమావేశంలో గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అగ్రికల్చర్ అధికారిణి దీపిక రైతులకు సాగుపై అవగాహన కల్పించగా కార్యదర్శి భాస్కర్ రెడ్డి పంచాయతీ నివేదికలను చదివి వినిపించారు.