NZB: ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ రూమ్ తదితర విభాగాలను శుక్రవారం పరిశీలించారు. తనిఖీ సమయంలో డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ANM పద్మలత తీరును తప్పుబడుతూ.. షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు.